నిమ్మరసం మరియు తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి ఉదయాన బ్రష్ చేసిన తర్వాత ప్రతీ రోజూ తీసుకోవాలి. ఇలా ప్రతి రోజు తీస్కోవడం వల్ల పొట్టలో కొవ్వు చేరకుండా ఉండటమే కాకుండే ఉన్న ఫ్యాట్ కంటెంట్ ను తగ్గిస్తుంది. ఇలా తీస్కోవడం వలన పొట్ట బరువుగా లేకుండా, తేలికగా ఉండి సులభంగా పనులు చేస్కోగలుగుతారు.
అర్శ మొలలు - వాటి నివారణ

కావలసినవి:
కుంకుడు కాయలు=150 గ్రాములు
తయారు చేయు విధానం: కుంకుడు కాయలనుండి శుభ్రంగా విత్తనాలను వేరు చేసి, పై బెరడును మాత్రం ఒక రోలు లో వేసి, దీనిలో కొద్దిగా నీళ్లు వేస్తూ మెత్తగా నూరండి. తర్వాత దానిని బఠాణీ గింజ పరిమాణంలో మాత్రలు గా చేసి గాలికి ఆరబెట్టండి. ఆరిన తర్వాత ఈ మాత్రలను 45 రోజుల పాటు ప్రతి రోజు ఉదయాన్నే పరగడుపున, మరియు రాత్రి భోజనానికి అర్థ గంట ముందుగా సేవిస్తే ఇక మొలలు మాయం.
Labels: మొలలు
శరీర దుర్వాసనను దూరం చేయడానికి...

నల్ల ఉలవల పొడి = 100 గ్రాములు
మెంతుల పొడి = 100 గ్రాములు
కస్తూరి పసుపు పొడి = 100 గ్రాములు
బావంచాల పొడి = 100 గ్రాములు
కరక్కాయల బెరడు పొడి = 100 గ్రాములు
ఖర్జూరాల పొడి = 100 గ్రాములు
తయారు చేయు విధానం:
అన్నీ పొడుల ను మిక్స్ చేసి, ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. మిశ్రమం చేసిన పొడిలో కొంచెం నువ్వుల నూనె కాని, పాలు కాని కలిపి ప్రతి రోజు స్నానానికి అర్థగంట ముందు మీ చర్మానికి అప్లై చేయండి. ఇలా 30 రోజులు చేసి చూడండి. మీ శరీర దుర్వాసన మటుమాయం.
Labels: శరీర జాగ్రత్తలు
జుట్టు రాలడం మొదలయ్యిందా? అయితే జాగ్రత్త పడండి!

జుట్టు రాలడం మొదట్లోనే మీరు తగిన జాగ్రత్తలు తీస్కుంటే ఇకముందు రాలకుండా ఉంటుంది. కాబట్టి మీరు ఈ క్రింది విధంగా చేసి మీ జుట్టును సంరక్షించుకోండి.
కావలసినవి:
కొబ్బెరి నూనె = 250 గ్రాములు
మిరియాలు = 10 గింజలు
మొదట మిరియాలను నూరి పొడి చేయండి. కొబ్బెరి నూనెను వేడి చేసి అందులో మిరియాల పొడిని వేసి కలుపుతూ బాగా మరగబెట్టండి. చల్లారిన తర్వాత, ప్రతి రోజు రాత్రి నిద్రపోయే ముందు మీ తలకు ఆ నూనెను పట్టించండి. ఇలా 45 రోజులు చేస్తే మీ జుట్టు రాలే సమస్య తీరుతుంది.
Labels: తల భాగం

